బీసీ సమాజాన్ని చైతన్యపరిచి ఐక్యం చేయడం అత్యవసరం. గత 26 ఏండ్లుగా అణగారిన వర్గాల కోసం ఉద్యమాలు లేకపోవడంతో బీసీలు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. ఫూలే, అంబేద్కర్, సావిత్రిబాయి ఆశయాలను కొనసాగించిన కామ్రేడ్ మారోజు వీరన్న 26వ వర్ధంతి (మే 16) సందర్భంగా, తెలంగాణలో ప్రతి బహుజనుడు సంకల్పించి బహుజన రాజ్యం స్థాపించడమే ఆయనకు నిజమైన నివాళి. ఐక్యత, సామాజిక న్యాయం కోసం పోరాడుదాం.