AP: విశాఖ మేయర్ పీఠం కూటమిదేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దీమా వ్యక్తం చేశారు. విశాఖ మేయర్ పై అవిశ్వాస బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అయ్యేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. కానీ తాము ఎవరినీ బలవంతం చేయడం లేదని చెప్పారు. విశాఖ 74వ వార్డు వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లు ఆయన తెలిపారు.