TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఎకో టూరిజం పార్క్ ఎక్సీపీరియమ్‌లోప్రపంచ సుందరీమణులు సందడి చేశారు. ఎకో పార్క్‌ను సృష్టించిన రాందేవ్ రావు మిస్‌వరల్డ్ 2025 కంటెస్టెంట్‌లకు పార్క్ విశేషాలను వివరించారు. మొత్తం 85 దేశాల నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఈ పార్కులో ఉన్నట్లు వెల్లడించారు. సొంత పరిజ్ఞానంతో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పార్క్‌ను సందర్శించిన సుందరీమణులు చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు.