వైసీపీ గూటికి మాజీ ఎంపీ ఉండవల్లి!

68చూసినవారు
వైసీపీ గూటికి మాజీ ఎంపీ ఉండవల్లి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిగా వెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఉండవల్లి 10 ఏళ్ల క్రితమే రాజకీయ సన్యాసం తీసుకోగా... రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా ఫిబ్రవరి 26న జగన్ సమక్షంలో అరుణ్ కుమార్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే.

సంబంధిత పోస్ట్