ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త స్టాఫ్ ప్యాటర్న్ నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో మొత్తం 9 రకాల ప్రభుత్వ పాఠశాలలుగా విభజించింది. స్కూళ్లను బట్టి టీచర్లను కేటాయించేలా మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.