స్కూల్స్, షాపింగ్ మాల్స్, ఆస్పత్రుల్లో అగ్నిప్రమాద నివారణకు ఆర్‌సీసీ/కాంక్రీట్ క్లాబులను పైకప్పుగా వాడాలి. ఫైర్ అలారం, స్మోక్ డిటెక్టర్లను కీలక ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్‌ను తప్పనిసరిగ్గా ఉపయోగించాలి. ఐఎస్‌ఐ మార్క్ ఉన్న ఎలక్ట్రికల్ సామగ్రిని మాత్రమే ఉపయోగించాలి. బయటికి వెళ్లే మార్గాల్లో మెట్లు, తలుపుల వద్ద ఆటంకాలు లేకుండా చూసుకోవాలి.