దొండకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతాయని, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయట. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అన్ని శక్తిని అందిస్తాయి.