మానవ మనుగడకు ఆక్సిజన్ చాలా అవసరం. ఈ ఆక్సిజన్ మనకు మర్రిచెట్టు, వేప, రావి, కరివేపాకు, వెదురుబొంగు చెట్ల నుండి ఎక్కువగా వస్తుంది. ‘మర్రిచెట్టు’ ఆక్సిజన్ అధికంగా అందించడంతో పాటు వాతావరణంలో CO2 శాతాన్ని తగ్గిస్తుంది. ‘వేప’ సహజ క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. ‘రావి’ రాత్రివేళల్లోనూ ఆక్సిజన్ అందిస్తుంది. ‘కరివేపాకు, వెదురుబొంగు’ చెట్లు ఇతర వాటితో పోలిస్తే 33 శాతం అధికంగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.