EOS-09 శాటిలైట్ రక్షణ, పౌర అవసరాలకు ఉపయోగపడుతుంది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల వద్ద 24 గంటల నిఘాను పర్యవేక్షిస్తుంది. ఇది రాత్రి వేళల్లో కూడా శత్రు కదలికలను గుర్తించగలదు. వ్యవసాయంలో పంటల ఆరోగ్యం, భూమి వినియోగానికి అంచనా, అడవుల సర్వే, అక్రమ కలప తొలగింపును గుర్తించడం వంటి పనులకు సహాయపడుతుంది. వరదలు, తుఫానులు వంటి సహజ విపత్తుల సమయంలో ఇది అందించే సమాచారం ద్వారా నష్టాన్ని అంచనా వేయడం, రక్షణ కార్యకలాపాలను సమన్వయం చేయడం సులభమవుతుంది.