వరి నాట్లు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

80చూసినవారు
వరి నాట్లు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
నారుమడి నుంచి నారు తీసే వారం రోజుల ముందు ఎకరానికి సరిపడా నారుమడికి కిలో కార్బోప్యూరాన్ 3జి గుళికలు వేసి నీరు పెట్టి ఇంకించాలి. దీనివల్ల పొలంలో నెలవరకూ పైరును పురుగులు ఆశించవు. వరి రకాల పంట కాలాన్ని బట్టి 22 నుంచి 28 రోజుల వయసుగల నారును నాట్లు వేసుకోవాలి. నారుమడి నుంచి పెరికిన నారు కట్టలను నానో DAP ద్రావణంలో (లీటరు నీటికి 4ml) 15 నిమిషాలు ముంచి నాటితే పొలంలో పైరు తొందరగా వేర్లు తొడిగి నాటుకుంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్