బారికేడ్లు పెట్టి ఓటర్లను అడ్డుకుంటున్నారు: ఆప్

76చూసినవారు
బారికేడ్లు పెట్టి ఓటర్లను అడ్డుకుంటున్నారు: ఆప్
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి సౌరభ్ భరద్వాజ్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆప్‌కు మద్దతున్న ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ఓటర్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 200 మీటర్ల దూరంలోనే బైక్‌లను, కార్లను అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా అయితే వృద్ధులు, వికలాంగులు ఎలా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్