తనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. కిరణ్ రాయల్ తనకు రూ.1.30 కోట్లు ఇవ్వాల్సి ఉందని, డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి అనే మహిళ చేసిన ఆరోపణలపై కిరణ్ స్పందించారు. క్రిమినల్ లేడీతో తనపై నిరాధార ఆరోపణలు చేయించారని ఆయన తెలిపారు. ఇదంతా వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం అని ఆరోపించారు.