AP: గత 15 ఏళ్లుగా వైసీపీ అధినేత జగన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూనే వస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. జగన్ చేసిన అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. అదానీ దగ్గర లంచం తీసుకున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేబినెట్లో చర్చించిన తర్వాత సెకీతో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందన్నారు.