AP: తణుకు గ్రామీణ SI ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఫోన్‌లో మాట్లాడారు. ఆ ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘సంబంధం లేని విషయంలో నన్ను ఇరికించారు, కావాలనే ఆ ఇద్దరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. విజ్జిని, పిల్లలను తలచుకుంటే బాధేస్తోంది. వారు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారు’ అని SI ఆవేదన వ్యక్తం చేశారు.