తెలుగుదేశం పార్టీపై వైసీపీ మాజీ మంత్రి ఆర్‌కే రోజా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. దళితులపై భౌతికంగా దాడి చేసి, వాళ్ల ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ల మీదే రివర్స్ కేసు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. దళితులపై దాడికి పాల్పడ్డ వంశీ, కిరణ్, పురుషోత్తంలను వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. దళితులను ఊళ్లో రానివ్వమని, తిరగకూడదని, ఊరి నుంచి వెలి వేయాలని తెలుగుదేశం నాయకులు హుకుం జారీ చేస్తున్నారని పేర్కొన్నారు.