వేటకు వెళ్లి అడవి పంది అనుకుని .. తోటి వ్యక్తిని కాల్చి చంపారు!

62చూసినవారు
వేటకు వెళ్లి అడవి పంది అనుకుని .. తోటి వ్యక్తిని కాల్చి చంపారు!
మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి అటవీప్రాంతంలో పలువురు గ్రామస్థులు వేటకు వెళ్లారు. అనంతరం రెండు బృందాలుగా విడిపోయి వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఓ బృందం కదలికలను అడవి పందులుగా పొరపాటు పడి మరో బృందం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో తోటి వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్