AP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బుధవారం జరిగిన పొలిట్ బ్యూరోలో ఓ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. పార్టీలో ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదనే నిర్ణయాన్ని కేవలం మండల స్థాయికే పరిమితం చేశారు. వరుసగా 3 సార్లు.. అనగా ఆరేళ్లు మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారందరినీ మార్చేయాలని నిర్ణయించారు. అవసరమైతే పదవిని సైతం మార్చాలని చెప్పారు. కొత్త వారికి అవకాశాలు పెంచాలని అన్నారు. దీంతో లోకేశ్ ప్రతిపాదనకు అందరూ స్వాగతం పలికారు.