AP: శ్రీకాకుళం జిల్లాలోని ఆధ్యాత్మిక మందిరంలో జరిగిన అగ్ని ప్రమాదం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరమన్నారు. దీనిపై లోతుగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని తెలిపారు.