జగన్ ఉన్మాద మనస్తత్వానికి ఇది నిదర్శనం: దేవినేని

55చూసినవారు
జగన్ ఉన్మాద మనస్తత్వానికి ఇది నిదర్శనం: దేవినేని
AP: ప్రకాశం జిల్లా పొదిలిలో మహిళలపై సైకోలతో దాడి చేయించడం దుర్మార్గమని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పొదిలిలో రాళ్లదాడి.. జగన్ ఉన్మాద మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై చేసిన దాడిని ఆయన ఖండించారు. రాళ్ల దాడికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ చేసిన దాడికి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్