జగనన్న అమ్మ ఒడి, తల్లికి వందనం పథకానికి తేడా ఇదే

84చూసినవారు
జగనన్న అమ్మ ఒడి, తల్లికి వందనం పథకానికి తేడా ఇదే
గతంలో YCP ప్రభుత్వం "జగనన్న అమ్మ ఒడి" పథకాన్ని అమలు చేసింది. ఇది కూడా పిల్లల విద్యకు రూ.15,000 అందించేది. కానీ, అమ్మ ఒడిలో ఒక కుటుంబానికి ఒకే విద్యార్థికి మాత్రమే సహాయం అందేది. "తల్లికి వందనం" పథకం దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా.. ప్రతి విద్యార్థికి రూ.15,000 సహాయం లభిస్తుంది. ఇది చదువుకునే పిల్లలకు ఆర్థిక సహాయం అందించి, విద్యను ప్రోత్సహిస్తుంది.