IPL-2025 పునఃప్రారంభం ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ జట్టు తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఇద్దరు వ్యక్తులు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌కు తిరిగి వస్తున్నారా? లేదా? అని చర్చించుకుంటారు. అప్పుడు శ్రేయాస్ అయ్యర్ వచ్చి మీరు చెబుతున్న వాళ్లంతా నిజంగా ప్రతిభ ఉన్న క్రీడాకారులే. కానీ ఇది 'ఇండియన్' ప్రీమియర్ లీగ్ అని అంటాడు. 'విదేశీ ఆటగాళ్లు వచ్చినా, రాకున్నా IPL ఆగదు' అనే ఉద్దేశంతో శ్రేయాస్ ఇలా అన్నాడు.