విజయవాడ నగరం మధ్యలోంచి ప్రవహిస్తున్న బుడమేరు శాపంగా మారింది. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి నుండి కవులూరు వెళ్లే మార్గంలో ఉన్న బుడమేరు కట్ట తెగిపోవటంతో విజయవాడ నీట మునిగింది. 15వేల క్యూసెక్కుల నీళ్లు వెళ్లే బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో బుడమేరుకు 25 అడుగుల గండి పడింది. అంతే కాదు బుడమేరు వరద కొల్లేరులో కలవాలి. అయితే కొల్లేరులో ఆక్రమణల వల్ల బుడమేరు వరద నీరు వెనక్కి వచ్చిందని అంటున్నారు. బుడమేరు కూడా ఆక్రమణలకు గురికావడంతో విజయవాడ ముంపునకు కారణమని పలువురు చెబుతున్నారు.