TG: అదృష్టమంటే అతనిదే. రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లో ఓ కార్మికుడు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. రైల్వే లైన్ దాటుతుండగా నిలిచి ఉన్న గూడ్స్ రైలు ఒక్కసారిగా కదలడంతో అతడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్టాలపై పడుకున్నాడు. రైలు మొత్తం వెళ్లిపోయాక క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.