ఏపీలోని కరవు మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూ. కళాశాలల విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం అందించేలా అధికారులను ఆదేశించాలని.. కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురుతేజ హైకోర్టులో పిల్ వేశారు. 14ఏళ్లు వచ్చే వరకు పోషకాహారం ఉచితంగా పొందేందుకు చిన్నారులకు హక్కు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో 6 జిల్లాల్లో కరవు ప్రభావితమైన 87 మండలాల విద్యార్థులకు వర్తింజేయాలని కోరారు.