స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పీఎం నరేంద్ర
మోదీ ప్రసంగిస్తూ.. "మన తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మనం తీవ్రంగా ఆలోచించాలి" అని అన్నారు. "దీనిపై వ్యక్తం అవుతున్న ఆగ్రహావేశాల్ని నేను అర్థం చేసుకోగలను. మహిళలపై జరిగే నేరాలను త్వరితగతిన విచారించాలి. క్రూరమైన చర్యలకు పాల్పడే వారిని వెంటనే శిక్షించాలి" అని అన్నారు. కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.