ట్రంప్‌ను ఉద్దేశించి బెదిరించినట్టుగా భావిస్తున్న సోషల్ మీడియా పోస్టుతో FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో “86 47” అనే పదాలను పోస్టు చేసి వెంటనే డిలీట్ చేశారు. ఈ పదాలకు "47వ అధ్యక్షుడిని చంపేయడం" అనే అర్థం వచ్చే అవకాశముండటంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తనకు హింస అంటే ఆసక్తి లేదని, తన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారని కామీ స్పష్టత ఇచ్చారు.