AP: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కుందుర్పి మండలం మలయనూరులో మహారాష్ట్రకు చెందిన 8 కుటుంబాలు కొన్నేళ్లుగా బొగ్గులు కాల్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు చిన్నారులు సమీపంలోని మట్టి తిన్నెలపై ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ మట్టి పెళ్లలు పిల్లలపై కూలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.