ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మైనర్ బాలురు మృతి

78చూసినవారు
ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మైనర్ బాలురు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తారి జిల్లా కురుద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు మైనర్లు స్కూల్ మానేసి ట్రాక్టర్ నడిపేందుకు బయటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను చర్రా గ్రామానికి చెందిన ప్రీతమ్ చంద్రకర్ (16), మయాంక్ (16), సాహు (14) గా పోలీసులు గుర్తించారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్