8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం

74చూసినవారు
8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం
నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. పగిడ్యాల మండలం ఎల్లాల గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడడ్డారు. ఆదివారం సాయంత్రం ముచ్చుమర్రి పార్కు వద్ద ఆడుకుంటున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. ఆ విషయం బయటకు రాకుండా ఉండేందుకు బాలికను కాలువలోకి తోసేశామని ఒప్పుకొన్నారు. దాంతో పోలీసులు బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్