AP: రాష్ట్రంలోని పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో శుక్రవారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.