రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

50చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు(మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్