ఏపీ ప్రజలకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ఆదివారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. సోమవారం రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.