గన్నవరం పరిసర ప్రాంతాల్లో పులి సంచారం!

72చూసినవారు
గన్నవరం పరిసర ప్రాంతాల్లో పులి సంచారం!
AP: గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరోసారి పులి సంచారం కలకలం రేపుతుంది. పులి కదలికలపై స్థానికుల్లో భయాందోళనలు నెలకున్నాయి. ఆగిరిపల్లి మండలం కళ్ళుటూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ బొకినల రవి కిరణ్ ఇవాళ డ్యూటీకి వెళ్తుండగా పులిని చూసినట్లు చెప్పాడు. రవి.. గన్నవరంకు బైక్ పై వెళ్తుండగా మార్గ మధ్యలో సగ్గురు, మెట్లపల్లి దారి మధ్యలో ఒక పులి పిల్ల రోడ్డు దాటుతుండగా చూసినట్టు తెలిపాడు. దీంతో రవి స్థానిక గ్రామస్థులకు సమాచారం అందించగా.. వారు పోలీసులకు సమాచారమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్