AP: బురద చల్లడం పారిపోయి ప్యాలెస్‌లో దాక్కోవడం వైసీపీ అధినేత జగన్ కు అలవాటు అని మంత్రి లోకేశ్ మిమర్శించారు. 'తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేశాను. సమయం ముగిసింది. రుజువు చెయ్యలేదు. క్షమాపణ కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేకు జగన్ అనేది. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా! శరణమా..న్యాయ సమరమా? తేల్చుకోండి' అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.