హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి సైనిక్ ట్యాంక్ వరకు ర్యాలీ సాగనుండగా, ఇది అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్‌ల మీదుగా సాగుతుంది. ప్రజలు వేరే రూట్‌లో రావాలని అధికారులు సూచించారు.