తిరుమల కల్తీ నెయ్యి కేసు.. నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ

53చూసినవారు
తిరుమల కల్తీ నెయ్యి కేసు.. నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో అరెస్టైన నలుగురు నిందితులకు పోలీసు కస్టడీ విధిస్తూ గురువారం తిరుపతి రెండో అదనపు మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్, భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్, పొమిల్‌ జైన్, వైష్టవి డెయిరీ సీఈవో అపూర్వ చావ్డాలను ఐదు రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.

సంబంధిత పోస్ట్