చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పులివర్తి నాని బుధవారం శంకుస్థాపన చేశారు. తిరుమలనగర్, కేబీఆర్ నగర్, చెన్నయ్యగుంట గ్రామాల్లో కల్వర్టులు, సీసీ రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. ప్రజా సంక్షేమమే మా లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.