

YCP సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి లోకేష్ (వీడియో)
AP: పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై YCP సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. "మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం. మహిళలపై వైసీపీ నేతలు ఒళ్లు బలిసి మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై వైసీపీ చేసిన దాడికి జగన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి." అని లోకేష్ డిమాండ్ చేశారు.