శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం

60చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీ కృష్ణ‌స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, పసుపు, చందనాల‌తో వేడుకగా అభిషేకం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో గోవింద రాజన్, అర్చ‌కులు బాబు స్వామి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్