చంద్రగిరిలో వైభవంగా కావమ్మ తిరునాళ్ళు

62చూసినవారు
చంద్రగిరిలో వైభవంగా కావమ్మ తిరునాళ్ళు
చంద్రగిరి పట్టణంలోని శ్రీకావమ్మ తల్లి అమ్మవారి తిరునాళ్ళు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అమ్మవారికి సారే సమర్పించారు. కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. పాడిపంటలతో గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని, దుష్ట శక్తులు నుంచి గ్రామాన్ని కాపాడాలని అమ్మవారిని కోరినట్లు పులివర్తి నాని తెలిపారు.