చంద్రగిరిలో ఘనంగా రంజాన్ వేడుకలు

78చూసినవారు
చంద్రగిరిలో ఘనంగా రంజాన్ వేడుకలు
పవిత్ర రంజాన్‌ పండగను ముస్లింలు చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదర, సోదరీమణులకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈద్ ముబారక్ తెలియజేశారు. చంద్రగిరి సమీపంలోని రెడ్డివారిపల్లి ఈద్గా మైదానం చేరుకున్న తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్