చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు.