వివాదాలు సృష్టించే ఏజెంట్లను బయటకు పంపించేస్తాం: జేసీ

83చూసినవారు
వివాదాలు సృష్టించే ఏజెంట్లను బయటకు పంపించేస్తాం: జేసీ
కౌంటింగ్ లో ఉద్దేశపూర్వకంగా తరచూ వివాదాలు సృష్టించే ఏజెంట్లను నిర్దాక్షిణ్యంగా బయటికి పంపిచేస్తామని జేసీ శ్రీనివాసులు శనివారం చెప్పారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఆయన చిత్తూరులో మాట్లాడారు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకునే స్థానిక ప్రజాప్రతినిధులైన కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండటానికి వీల్లేదన్నారు.

సంబంధిత పోస్ట్