చిత్తూరు: క్యూఆర్ కోడ్ చెల్లింపులపై అవగాహన

62చూసినవారు
చిత్తూరు: క్యూఆర్ కోడ్ చెల్లింపులపై అవగాహన
చిత్తూరు జిల్లా విద్యుత్ బిల్లులను ఈనెల నుంచి క్యూఆర్ కోడ్ తో పాటు ఇస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు అవగాహన కల్పించాలని ట్రాన్స్ కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ శుక్రవారం సూచించారు. కరెంటు బిల్లులు చెల్లించడానికి క్యూలైన్లో వేచిచూసే పనిలేకుండా నూతన విధానం ప్రవేశ పెట్టారన్నారు. బిల్లులో క్యూఆర్ కోడ్ వస్తుందని, దాన్ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్