మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరులోని రైల్వే గేట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం ఆవరణంలో బీట్ ద హీట్ కార్యక్రమాలను నిర్వహించారు. రైల్వే గేట్ పడినప్పుడు వాహనదారులు ఎండ వేడిమికి ఇబ్బంది పడకుండా గ్రీన్ మ్యాట్ తో పైకప్పు వేయించారు. వేచి ఉండే వాహనదారులకు తాగునీరు, ఓఆర్ఎస్ నీరు అందించారు. బీఆర్ అంబేద్కర్ భవనం ఆవరణంలో మొక్కలు నాటి నీరు పోశారు. వేసవి నేపథ్యంలో పక్షులకు నీరు అందించడం కోసం చెట్లలోని కొమ్ములకు మట్టి పాత్రలను ఏర్పాటు చేసి నీరు పోశారు.