వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై శనివారం డిఎంహెచ్ఓ సుధారాణి తన ఛాంబర్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్సీడి సర్వేలో సస్పెక్ట్ కాబడిన కేసులను వైద్యాధికారులు 100 శాతం పూర్తి చేయాలన్నారు. మాతా శిశు మరణాలు జరగకుండా గర్భిణీ స్త్రీల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సుఖప్రసవాలు జరిగేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చర్యలు చేపట్టాలన్నారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు 100 శాతం అమలు జరిగేలా చూడాలన్నారు.