గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ మంగళవారం ఆరోపించారు. చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి రూ. 10 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. వడ్డీ రూ. 71 వేల కోట్లు కూటమి ప్రభుత్వంపై భారం పడిందన్నారు. వివిధ వర్గాలకు రూ. 1. 40 లక్షల కోట్ల బకాయిలను పెట్టారన్నారు. రూ. 8 లక్షల కోట్లు వైసీపీ బృందం దోచుకుందన్నారు.