చిత్తూరులో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ, ఎందుకు తెలుసుకోలేకపోయారని అధికారులను కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రశ్నించారు. పీసీపీఎన్ డీటీ యాక్ట్ 1994 డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.