ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకులో రుణ సౌకర్యం కల్పించాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మంగళవారం డిమాండ్ చేశారు. చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందన్నారు. బ్యాంకు రుణాల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7. 5%, ఓబీసీలకు 27% రుణాలు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.