చిత్తూరుజిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, జూనియర్ కళాశాలలో ఈనెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కమిషనర్ పి నరసింహ ప్రసాద్ చెప్పారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆల్బెండజోల్ మాత్రలను పాఠశాల హెచ్ఎం కు అందించారు.